September 11, 2025
The GOD!             What is GOD?
Articles

The GOD! What is GOD?

May 30, 2025

The God : ఎన్ని సంవత్సరాలైన.. ప్రపంచం మొత్తం అంతరించే వరకు..ఎప్పుడు trending లో ఉండే topic ఇదే!

ఒక్కడు దేవుడు లేడు అనగానే, దేవుడిని నమ్మేవారు కుప్పలు, కుప్పలుగా వచ్చి ఆ దేవుడు లేడు అని చెప్పినవాడి మీద పడతారు!అప్పటివరకు శాంతిగా ఉన్న జనాలకి BP పెరిగి, వాళ్ళ దగ్గర ఉన్న కోపానంత వాడిమీద చూపించడం మొదలేడుతారు!ఇలా దేవుడు లేడు అని చెప్పగానే.. అన్ని మతాల మనుషులు.. దేవుడు లేడు అని చెప్పిన మనిషి పైన మాటల దాడికి దిగుతారు!

అదే దేవుడు ఉన్నాడు అనగానే చల్లబడి మేమే గెలిచాం అని సంబరపడిపోతారు..కానీ అదే దేవుడు మ మతానికి చెందినవాడే, మిగతా మతాలకు చెందిన వాడు దేవుడు కాదు అనగానే మళ్ళీ కొట్టుకుని చస్తారు! ఇదే తరాతరాల నుండి వస్తున్న మూర్ఖత్వమైన విషయం!

నాకు అర్ధం కానీ విషయం ఏంటంటే..అస్సలు దేవుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మనం కష్టాల్లో, ఆపదలో ఉంటే.. ఆ దేవుడు వచ్చి ఇన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళడు కదా?

ధైర్యాంగా ఉండు అని ఓదార్చి పోడు.. పోనీ నీ ఇంట్లో పుట్టాడా? లేదా పక్కింట్లో పుట్టాడా?

లేదా నీ కులంలో పుట్టాడా? లేకపోతే నీ మతంలో పుట్టాడా? ఒకవేళ నీ కులం లో, నీ మతంలో పుడితే.. ఆ దేవుడు అనేవాడు ఆ కులం , మతానికే చెందిన వాడు అవుతాడు.. కానీ.. అందరికి దేవుడు ఎలా అవు తాడు?? లేదు నిజంగానే , మీ కులం, మతంలో పుడితే.. మిగతా మతాలు , కులాలను ఆ దేవుడు Insult చేసిన వాడే అవుతాడు కదా??

ఒకే కులం, మతంలో పుట్టి, మిగతా కోట్లలో ఉన్న జనాలను ఎలా వదిలేసాడు? ఇలా.. మన కుల, మతంలో నే పుట్టడం వలన.. వాళ్లకు మనకి నిరంతర గొడవలే జరుగుతాయి కదా.. దానివల్ల పసి ప్రాణాలు, గర్భిణీ స్త్రీలు, అమాయకులు హింసకు బలి అయిపోతారు కదా? ఇదంతా జరగాలని దేవుడు నీ కులం, మతంలో పుట్టాడా??ఇన్నికోట్ల ప్రాణాలకి విలువ ఇవ్వని దేవుడు కూడా దేవుడేనా?అలాంటివాడిన నువ్వు పూజిస్తున్నావ్??

కొంతమందిని చల్లగా చూసి ఇంకొంత మందిని పాపులుగా చూసినవాడు దేవుడు ఎలా అవుతాడు!ఆంటే మన కులం, మతంలో లో ఉన్నవాళ్లు అంత పరిశుద్దులు మిగతా వాళ్లంతా పాపులు ఆహా??

ఇదే కదా అన్ని మత గ్రంధాలు చెప్పే కథలు! ఒకవేళ పాపులు, పరిశుద్దులు అనే మాటలు.. నిజంగానే దేవుడు చెప్తే… మనుషుల లో మానవత్వన్ని చంపి, మత చిచ్చు పెట్టిన వాడు…ఆ దేవుడు!

నిజానికి ఏ నా కొడుకు దేవుడిని చూడలేదు, ఏ నా కొడుకు దేవుడి స్పర్శన్ని, శరీరాన్ని ముట్టుకోలేదు, తాకలేదు! కానీ.. దేవుడు దేవుడు అని నరాల్లో నింపుకున్నాడు!

చూడనప్పుడు, ముట్టుకోనప్పుడు.. మనం ఉన్నది, ఉంది అని అనుకుంటున్నామంటే.. అదంతా మన భ్రమ! మనలో ఉన్న పిచ్చి భ్రమ!

ఒక్క అమ్మాయి ప్రేమ కోసం లోతుగా వెళ్తే..

వాడు ప్రేమ పిచ్చోడు అవుతాడు.. అదే డబ్బుకోసం లోతుగా వెళ్తే, వాడు డబ్బు పిచ్చి వాడు అవుతాడు!ఇక్కడ దేవుడు కూడా అంతే..

దేవుడి గురించి లోతుగా వెళ్లిన ఒక్కడు.. ఆ రోగాన్ని మనకు అంటించాడు.. ఆ అంటిన రోగమే కరోనా కంటే ఎక్కువ మొత్తదులో ప్రపంచాన్ని తాకింది..

కానీ.. ఆ రోగం లక్షణం ఏంటంటే..నన్ను మీరు గనుక అంటుకుంటే మీరు గొప్ప బరువు అవుతారు, మీ జీవితాలు బాగుపడతాయి, సత్యాన్ని తెలుసుకుంటారు, పరలోకం, స్వర్గం ఉంటుంది అని!

ఇన్ని free గా వస్తున్నప్పుడు ఎవ్వడు కాదు అంటాడు?? ఎవ్వడు వద్దు అనుకుంటాడు?

ఎవ్వడు పక్కన పారేస్తాడు ఈ లక్షణాన్ని?? ఈ లక్షణమే అన్ని మతాల్లో ముద్రించబడింది! ఈ లక్షణమే అందరు పాటించేది, నమ్మేది! ఈ లక్షణమే అందరిని ఏర్రిపూకుగాళ్లనీ చేసింది!

ఒకవేళ దేవుడిని నమ్మాలంటే లక్షలు కట్టలంటే ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటారు?

ఈ ప్రపంచంలో అత్యధికమంది పేదోళ్ళే ఉంటారు కాబట్టి..దేవుడిని నమ్మేవాళ్ళు కోట్లల్లో ఉంటారు!నమ్మని వాళ్ళు అంకేలలో ఉంటారు!

అయిన కూడా.. దేవుడిది నా కులమే, నా మతమే అనుకుంటే?? అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, ఆఫ్రికా, etc దేశాల్లో వాళ్ళు ఎవరు? వాళ్లకు దేనికి నీ దేవుడి గురించి తెలీదు? వాళ్ళు దేనికి నీ దేవుడిని నమ్మరు!

నీ దేవుడే తోపు అని ఒప్పుకోరు?దేవుడిని అప్పుడెప్పుడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం చూసారు అంటారు.. నిజానికి ఎవ్వడికి clear గా తెలీదు.. కానీ అంటారు అంతే!

అప్పుడు రాసుకున్న కథలు.. ఇప్పటికి మన మధ్య చంపుకునే స్థాయికి వెళ్లాయి చూడు అది ఇంకా గోప్ప విషయం! చరిత్ర లో ఇన్ని యుద్దలు, ఇన్ని మరణాహోమాలు జరిగాయి..కానీ ఏ దేవుడి వాటిని ఆపలేడు! ఏ దేవుడి వాడి కులం లో ఉన్నవారిని కాపాడలేడు??

పోనీ.. మీరు మతాల కోసం కొట్టుకుని చావకండి అని, ఏ ఒక్క దేవుడు.. ఒక్క statement, ఏ ఒక్క భక్తుడికి ఇవ్వలేడు, చెప్పలేడు!

ఎందుకు చేయలేదు ఆలా? మనం యుద్దాల వాళ్ళ ఉన్న పోయిన ఆ దేవుడికి అవసరం లేదా??

అరేయ్ లాండికే.. ఇదంతా ముందే ఇలా జరగాలి అని రాసి ఉంది.. జరుగుతుంది అంటారా??

ముందే ఇలా రాసి ఉందంటే, ఆ దేవుడితో నీకేమి పని? నువ్వెందుకు నమ్ముతున్నావ్..

నువ్వెందుకు కొట్టుకుని చస్తున్నావ్? జరగాల్సింది జరిగి తీరుతుంది కదా?

#వ్యర్థం… రూపం లేని నమ్మకం, బలం లేని బలగం..

the god

ఎవ్వడి నమ్మకం వాడిది, నీకేం నొప్పి రా బాయ్ అంటారా?

ఏ దేవుడు అయిన, ఏ మత దేవుడైన..నీ చావుని అపి, నీ ప్రాణాన్ని కాపాడలేరు కదా?నీ చావుని ఇంకో వంద సంవత్సరాలకి వాయిదా వేయలేరు కదా?

నీ కష్టాలను ఇంకో వంద సంవత్సరాలకి వాయిదా వేయలేరు కదా? అయిన నువ్వు అదే మత, కులం కోసం కొట్టుకుని చస్తున్నావ్..

కొందరు అంటారు.. మన పుట్టుకకి దేవుడే కారణం.. అతను లేకపోతే మన పుట్టుక లేదు కదా అని? మన పుట్టుకకి దేవుడు కారణం ఐతే.. మన కష్టాలకి, చావులకి, నాశననికి, వినశానానికి, పాపాలకి ఆ దేవుడే కారణం కదా??

కానీ ఇది ఎవ్వడు ఒప్పుకోడు! ఎందుకంటె..? వాడు logic నీ నమ్మి తెలివి గా ఉండేకంటే, అదే logic నీ దాచుకుని, గుడ్డోడిగా ఉండిపోవాడానికే ఇష్టపడ్డాడు కాబట్టి!

దేవుడిని పూజించేవాడు కోటేశ్వరుడు అవ్వడు, దేవుడి పేరు చెప్పి సంపాదించే వాడు కోటీశ్వరుడు అవుతున్నాడు! ఈ తేడాలు నీకూ తెలీడం లేదా? వాడు కూడా దేవుడినే నమ్మాడు నేను కూడా దేవుడినే నమ్మినను, కానీ వాడేలా కోటీశ్వరుడు అయ్యాడు, నేనెలా కాలేను అని ఆలోచించే బుర్ర ఎప్పుడు రాలేదా నీకూ??

కానీ మనం.. దేవుడు అనే పేరుకోసం కొట్టుకుని చస్తాం!

నిజానికి దేవుడు చనిపోయాడు..ఆకలి కేకలు, మానభంగలు, దౌర్జన్యల ప్రార్థనలు అతనికి వినపడవు…వినపడవు అని తెలిసినా..పాపాలను ,పుణ్యాలను నువ్వు నమ్ముతున్నవ్ అంటే..

ఒక్క మనిషిగా.. నువ్వు బతికే బతుకు ఏంటి?

దేవుడు ,దేవుడి పేరుని బతికించడానికే ..దెయ్యం పుట్టింది! ఎందుకంటే… దేవుడు అనేవాడు అన్ని మంచే చేస్తాడు..అదే చెడు చేస్తే??

దెయ్యం అంటారు?? మంచి చేసినప్పుడు లేని దెయ్యం చెడు జరగ్గా నే ఎలా వచ్చింది??

దేవుడి ఆజ్ఞ లేనిది ఏది జరగదు అంటారు కదా?? మరి ఆ ఆజ్ఞ లేనిదే దెయ్యం ఎలా పుట్టింది??? మన దారిద్రపు బతుకులు,మన problems, చావులు, మరణాలు, మోసాలు కూడా దేవుడి కి తెలుసు కదా?? అంటే ఇవన్నీ దేవుడే ఇచ్చినట్టు, సృష్టించినట్టు కదా??

కానీ ఇక్కడ ఇలా చెప్తే..దేవుడు చెడ్డవాడు అయిపోతాడు కాబట్టి..మనకు జరిగిన ఈ చెడు ని.. మనకు కంటికి కనిపించని దెయ్యం మీద వేసేసాం..దీనినే ఇప్పటికి అందరం follow అవుతున్నాం…ఇలా నమ్మినప్పుడే మనం గుడ్డివాళ్ళం అయిపోయాం..

అదే తరతరాల నుండి మనకు పుట్టిన పిల్లలని కూడా గుడ్డివాడిగానే చేస్తుంది! దేవుడు అనేవాడు చెడ్డవాడు అవ్వకూడదు అని మానవుడికి ఎంత అరటమో కదా??

The god where are you? When we coming?

The god the god what is gs god what is god? The god what is god?

https://www.instagram.com/p/C_0fOtCy8Xd/?igsh=bm1qZDUzcWQydnQw

Further Any information contact : https://www.aviveki.com/contact/

Inspiration
Previous Post

Next Post

3 Comments

  • Clarity of thought 👌👌

  • Grt Analasys👏👏

  • Good 👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *