
GOD AND DEVIL దేవుడు దెయ్యం
GOD AND DEVIL : దేవుడు దెయ్యం
దెయ్యం… DEVIL
God and evil ఈ పేరు వినగానే… వెన్నులో వణుకు పుడుతుంది చాలామందికి!దెయ్యాన్ని చూసాం అని కొందరు, చనిపోయిన. వాళ్ళు దెయ్యాలు అవుతారు అని ఇంకొందరు… దెయ్యాలు తిరుగుతాయి అని మరికొందరు కథలు చెప్తూ ఉంటారు..
కట్ చేస్తే…..చనిపోయినవారు దెయ్యాలు అవుతారు అని చాలా మంది నమ్ముతారు. తరతరాల పూర్వికుల నమ్మకం కూడా!
అంటే నాకు అర్ధం కాని విషయం ఏంటంటే..మనిషిగా చచ్చిపోయి దెయ్యంగా పుడతారా ఏంటి? లేకపోతే.. ఆత్మ వేరే వారి శరీరంలో దూరుతుందా? ఒకవేళ దూరుతుందే అనుకుందాం.. కానీ ఎలా దూరుతుంది?
ఆత్మ అనే దానికి స్పర్శ నే ఉండదు.. అలాంటిది మన శరీరంలో ఎలా దూరుతుంది? స్పర్శ ఉన్న మనిషికి , స్పర్శ లేని, కంటికి కనపడని ఒక్క రూపం, శక్తి..ఎలా శరీరంలో కి వెళ్తుంది?? సరే శరీరంలో కి దూరుతుంది నే అనుకుందాం..మన బతుకులు డొక్కాడితే , గాని పూట గడవని బతుకులు మనవి..ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా చనిపోతే.. చనిపోయాక.. మన బతుకు ని చూసి అయిన, అ దెయ్యం ఏదైనా బ్యాంకు లోకి వెళ్లి ఒక్క 10, 20 కోట్లు, పోనీ ఒక్క వంద రూపాలు ఎందుకు మన ఇంటికి తీసుకురారు??
పోనీ పూట గడవని పరిస్థితి ఉంది, కనీసం 10 సంచుల బియ్యం అయిన తీసుకోచ్చి పడెయ్యరు ఎందుకు?? భయ్యా అది ఆత్మ కదా.. అవన్నీ చెయ్యదు అంటారా?? మరి ఇవన్నీ చేయనప్పుడు, మనుషులను ఎలా చంపుతుంది , మనుషులను ఎలా భయపెడుతుంది, మనుషులకి ఎలా కనిపిస్తుంది??? బతికి ఉన్నవారు బతకడానికి 100 రూపాయల సహాయం చెయ్యదు కానీ..పగబట్టి, పిచ్చి లేసి మనుషులని చంపుతుందా??
ఇదెక్కడి న్యాయం అండి అస్సలు?? ఇవన్నీ logic లు ఎవ్వడు ఆలోచించడు? పట్టించుకోడు.. కానీ దెయ్యం అనగానే వణికిపోతాడు!
అరేయ్ బుద్దిన్నోడు ఎవడైనా వాడి life సరిగ్గా అవ్వాలని అనుకుంటాడు గాని, వేరే వాడి life గురించి దేనికి ఆలోచిస్తాడు??? బతికున్నప్పుడు సరిగ్గా వండిపెట్టము కానీ..సచ్చాక కాకులకు వండిపెడతారు…అవి తింటే ఆత్మ శాంతిస్తుంది అని ఇంకేదో కథలు చెప్తారు..అరేయ్ ఎర్రిపువ్వ… బతికున్నప్పుడే వాడు ఆనందపడనిది, శాంతిగా ఉండనిది, సచ్చాక ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనుకున్నావ్??
సచ్చాక, బతికున్న ప్రపంచంతో సంబంధం ఉండదు ఆ ఆత్మకి.. ఆలా సంబంధం ఉండదు కాబట్టే..మన బతుకులు ఇలా తగలడ్డాయి.. ఒకవేళ సంబంధం ఉంటే.. మన తాతలు అందరూ కోట్లు వెనుకేసేవాళ్ళు మనకోసం..దెయ్యాలు అనేవి, దేవుడు పుట్టించినవి కావు… దేవుడితో పాటు పుట్టినవి!
ఒకవేళ పగ, ద్వేషం ఉంటే ఆ దేవుడి మీదే, మన మనుషుల మీద కాదు..ఎందుకంటే.. బుర్రన్న వాడు ఎవడైనా… చీమలు పురుగులు, కుక్కలతో యుద్ధం చేస్తాడా?? ఇక్కడ ఈ దెయ్యం, దేవుడికి కూడా అంతే మనం!
సచ్చినవారు దెయ్యాలు ఎప్పటికి అవ్వరు, అవ్వలేరు..దెయ్యం అనే మాటను మనం తరతరాల నుండి.. భయం తో మోస్తున్నాం కాబట్టి.. ఆ పేరు వినగానే భయం పుట్టుకొస్తుంది అంతే..దేవుడికి ఎలాగూ, పిల్లలు, తల్లులు, పెళ్ళాలు, సంబంధాలు ఉన్నాయో.. మనం ఎంత చించుకున్న దేవుళ్ళము అవ్వమో,దెయ్యాలకు కూడా పిల్లలు, తల్లులు, పెళ్ళాలు లాంటి సంబంధాలు ఉన్నాయి…ఇక్కడ మనం ఎంత చించుకున్న.. దెయ్యాలము అవ్వలేము..దేవుడు దెయ్యం అనేది, వారసత్వ రాజకీయం..కొత్తవారికి అవకాశం ఉండదు అందులో..ఎవ్వడో మన అధికారాన్ని దుర్వినియోగం చేసాడని ధర్నాలు చేస్తాం, ఆస్తులను తగలపెడుతాం..మరి మనం దెయ్యాలం ఐతే..ఇంతకు ముందు ఉన్నవారు ఏమి అయిపోవాలి?? వాళ్లకి మనం పోటీ ఐతే వాళ్ళేం చెయ్యాలి??మన మానవ జాతిని లేపి తగలెడుతారు కదా??
దెయ్యం లేదు అని కాదు.. ఉంది.. దానికి మనకు ఎలాంటి అవసరం లేదు.. దానికి మనకు పోటీ లేదు, శత్రుత్వం కూడా లేదు..దానికి శత్రుత్వం అంత దేవుడితో.. అ దేవుడు తోనే కొట్టుకు చావడానికి tym ఉందొ లేదో.. ఇంకా మనతో ఎలా కొట్లాడడానికి టైమ్ ఉంటది??
బుర్రలేని ఎదవలు.. తరతరాలు నుండి చెప్తూ వస్తున్నా కథలు.. బుర్రలేని ఎదవలు నమ్ముతూ వెళ్తున్నారు ఇప్పటికి..ఇప్పటికి అయిన దెయ్యం అనే concept పైన..భయం వదిలేయండి.. దైర్యంగా ఉండండి!
ఈ ప్రపంచంలో.. మన family, మన మనస్సు కంటే ముఖ్యమైనది ఏది లేదు..బతికున్న, సచ్చినా మన family కోసమే పోరాడతాం! అ పోరాటం లో.. దెయ్యం అనేది…నిన్ను భయ పెట్టే… ఒక్క పేరు!భయపడుతావో, భరించి నిలబడుతావో, భయం తో చస్తావో.. నీ మీదే ఆధారపడి ఉంటుంది!
ఎవరైనా నేను దెయ్యాన్ని చూసాను, కలిసాను ముద్దు పెట్టాను, hug చేసుకున్నావు అంటే.. మూతి పగలకొట్టండి… ఇలాంటి మాటల వల్లనే.. చిన్నప్పటి నుండి దెయ్యం అనే భయం లో బతుకుతున్నాం..మనకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు భయమే, పాతికెళ్ళు వచ్చాక భయమే, పండు ముసలి అయిన కూడా భయమే! ఈ భయం నిజం కాదని ఇక ముందు తరానికి అయిన చెప్పుదాం..
god and evil god and evil

దేవుడు -GOD
దేవుడు ఉన్నాడా? ఉంటే అతనికి మన పైన ప్రేమ ఉంటుందా? దేవుడు అనేది ఒక్క నమ్మకం.. దయ్యం అనేది కూడా ఒక్క నమ్మకమే..దేవుడు ఉన్నాడా అంటే ?? దేవుడు ఉన్నాడు..దెయ్యం ఉన్నదా? అంటే దెయ్యం ఉన్నది..మనుషులకి మనుషుల పైన నే ప్రేమ ఉండటం లేదు..ఇంకా దేవుడి కీ మన పైన ప్రేమ ఎలా ఉంటుంద అస్సలు ఎందుకు ఉంటుంది?? నిజానికి.. దేవుడు అనే వాడికి ఎమోషన్స్ ఉండవు..దేవుడు అనేవాడు నువ్వు ఏడ్చిన, సచ్చిన ,సంక నాకిపోయిన అతడికి అవసరం లేదు..ఎందుకంటే..అతడు నీకు ఒక్క లైఫ్ ని ఇచ్చాడు.. బతుకు ,చావు అని..నువ్వు ఎలా బతికిన ,సచ్చినా అతడు నీ మాటలకు respond అవ్వడు…నువ్వు పూజలు చేసినా, church కి వెళ్లిన గుడికి వెళ్లిన, ప్రార్థనలు చేసినా. .అతడు నిన్ను కనికరించడు!
ఎందుకంటే?? దేవుడు అనేవాడు భూమిమీద ఎప్పుడో సచ్చిపోయాడు! గుడికి వెళ్తేనే మనం బాగుంటాం , గుడికెళ్లకపోతే లైఫ్ బావుండదు అనే మాటలు.. చేతకాని వాడు మాట్లాడే మాటలు..ఈ పూజారులు, పాస్టర్స్ తరతరాల నుండి…పూర్వం ఉన్న కట్టుబాట్ల నుండి..మనుషుల్ని భయపెడుతూ వస్తున్నారంతే..అప్పుడప్పుడు దెయ్యం కనపడింది.. దెయ్యం పట్టింది అని అంటారు..
కానీ అరేయ్ దేవుడు కనపడ్డాడు, దేవుడు నీ చూసాను అని ఎవ్వడు అనడు..ఎందుకంటే..దేవుడు అనేవాడు..మనిషికి కనపడడు.. దేవుడు అనేవాడికి మనుషులు దుమ్ము,దూళితో సమానం.. దేవుడు ఉన్నాడు అని నమ్మడం correct.. కానీ..దేవుడు కష్టాలలో సహాయం చేస్తాడు,అదుకుంటాడు అని నమ్మడం మూఢ నమ్మకం..
మూఢ నమ్మకాలలో నే మనం ఇంకా బతుకుతున్నాం..దేవుడు అనేవాడు ఎవ్వడికి సహాయం చెయ్యడు.. అందులో మనిషికి అస్సలు చెయ్యడు..మన భయం -చేతకానితనం..దేవుడు సహాయం చేస్తాడు అని నమ్మేలా చేసింది తప్పితే..నిజానికి అది అబద్దం..ఇది నీ life.. ఏడ్చినా, నవ్వినా కష్టాలలో కొట్టుకు పోయినా.. నువ్వే అనుభవించాలి నువ్వే నీ problems ని Solve చేసుకోవాలి..అది నీ జన్మ అదే నీ పని..దేవుడి ని నమ్మడం మూఢనమ్మకం అని చెప్పడం లేదు..దేవుడు సహాయం చేస్తాడు అనుకోవడం మూఢనమ్మకం నీ చేతకాని తనం..దేవుడు సహాయం చేసేది నిజమైతే..మనుషులు అనేవారు happy గా ఉండేవారు.. problems అనేవి ఉండేవి కాదు గా.. మనుషులు problems లేకుండా ఉంటే దేవుడి అవసరం ఏముంది?? అప్పుడు దేవుడిని ఎవ్వడు గుర్తు చేసుకుంటాడు??
అడవిలో జంతువులు ఎలాగూ వాటికి అవి , కష్టమొచ్చినా వాన వొచ్చిన,ఎండ వచ్చిన ,చలి వచ్చిన.. సచ్చేవరకు బతుకుతాయో..మన బతుకులు కూడా అంతే..కాకపోతే మనిషి అనే వాడికి ఆత్మ ఉంటుంది, తెలివి ఉంటుంది వాటికి ఉండవు అంతే..నీ కష్టాలకు,ఇష్టాలకు కారణం నువ్వే.. వేరే ఎవడో వచ్చి తీర్చుతాడు అనుకోవడం నీ అమాయకత్వం..ఇప్పటికైనా దేవుడు పైన ఆధారపడటం మానేయ్..మతాలు ,కులాలు నిజాలు చెప్పవు.. నీతులు మాత్రమే చెప్తాయి..ఎందుకంటే నిజాలు, logic లు చెప్తే..మతాలు ,కులాలు అనేవి ఉండవు కాబట్టి..
ఇన్ని రోజులు..నీతులని నమ్మింది చాలు..ఇంకా నిజాన్ని నమ్ము, నిజాన్ని తెలుసుకో..ఈ నిజాలను తెలుకుంటే..నువ్వు ఎవ్వడి మీద ఆధారపడవు .. ఎవ్వడి ముందు చేతులు చాచవు..చనిపోయిన వారి దెయ్యాలు అవ్వరు..దెయ్యాలు అవుతారు అనేది అబద్దం..ఒకవేళ అలా అయితే ఇప్పటికి కొన్ని కోట్ల దెయ్యాలు ఉండేవి..ఆ దెయ్యాలు అన్ని కలిసి ..మనం దేవుడు ఒక్కడే అంటాం కదా..ఆ ఒక్కనొక్క దేవుడిని ఎప్పుడో చంపి పడేసేవి.. దెయ్యాలు అనేవి..మనచే సృష్టించబడినట్టే అవి కూడా సృష్టించబడినాయి..కాకపోతే వాటికి మళ్ళీ పుట్టుక ,చావు ఉండదు.. దేవుడు ఎలాగూ మన problmes ని పట్టించుకోడో దెయ్యాలు కూడా అలాగే మన మనుషులను పట్టించుకోవు..
దెయ్యానికే యుద్ధం దేవుడి తో నే మనిషితో కాదు..ఒకవేళ మనిషితో ఉంటే …ఈ పాటికి మానవ జాతి ఉండేదే కాదు..దెయ్యాని కి భయపడకు.. దేవుడి కి భయపడకు..దేవుడు ఇచ్చిన ఈ జన్మ నని ..ఒక్కడిని చంపకుండా,ఒక్కడిని మోసం చేయకుండా.. బతికితే చాలు..అదే నీ నిజమైన మనిషి తత్వం..అదే నువ్వు అనుకున్న దేవుడిని సంతోష పెడుతుంది!
మనిషి ఎప్పటికి ..దెయ్యం కాలేదు.. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆత్మ..నువ్వు చావగానే దేవుడు తీసుకెళ్లిపోతాడు..మధ్యలో ఆగడం, నిల్చోవడం అంటూ దానికి ఉండదు…దేవుడు ,దెయ్యం అని కబుర్లు చెప్పే వాళ్ల మాటలు నమ్మకండి..అవి పచ్చి అబద్దాలే కాదు..పచ్చి మోసాలు కూడా.. ఇన్ని సంవత్సరాలు గా మోసపోయింది చాలు..ఇంకా మోసపోవడం మానేయ్…సహాయం చెయ్యని వాడిని నమ్ముతున్నావ్ అంటే..నీ సమయాన్ని వృధా చేస్తునట్టే.. నీకు ఉన్న సమయంలో లో నువ్వు దేన్ని అయిన పీకి పడేయ్యగలం- దేన్నైనా చేయగలవు..
నిన్ను నువ్వు నమ్ము- దానికోసం కష్టపడు..ఆ తరువాత అందరూ నిన్ను నమ్ముతారు!!
Follow me on instagram 👉👉👉 https://www.instagram.com/aviveki_?igsh=N29qZDhzaDgyNnIw
god and evil god and evil

god and evil god and evil
Contact any information 👉👉 https://www.aviveki.com/contact/
3 Comments
clarity of thought 👌👌
Thanks
👏👏