September 11, 2025
Albert Camus
Philosopher's

Albert Camus

Jun 6, 2025

ఎందుకంటే.. నువ్వు సమాజం లో ఉన్నావ్ కాబట్టి!సమాజాన్ని follow అవుతున్నావ్ కాబట్టి! నువ్వు ఒక్క మంచి పని చేయు నిన్నెవడు గుర్తించడు, పట్టించుకోడు! అదే ఒక్క చేడు పని చెయ్.. అందరు గుర్తిస్తారు, పట్టించుకుంటారు! చివరకు నిన్ను judge చేసి, నువ్వు దొంగ నా కొడుకువి అని నిందలు వేస్తారు! నువ్వెంతా నీ గురించి చెప్పుకుందాం అనుకున్న వాళ్లు వినరు! ఎందుకంటే.. నువ్వు సమాజం లో ఉన్నావ్! వాళ్లు ఆడితే నువ్వు ఆడాలి, ఆడకపోతే నువ్వు అన్ని మూసుకుని కూర్చోవాలి! నువ్వు ఎవరిని ప్రేమించాలి, ఎవ్వరిని ప్రేమించకూడదు, ఒకవేళ ప్రేమించకపోతే ఆడదానితో గడిపే అదృష్టం నీకు లేదంటారు!

Albert camus

ఏ దేవుడు దగ్గరికో తీసుకెళ్తారు..ఇదంతా ఎందుకు చేస్తారు?? ఎందుకంటే నువ్వు నీకు నచ్చినట్టుగా ఉన్నందుకు? నీకు నచ్చినట్టుగా ఉండాలి అనుకున్నందుకు!

ఈ సమాజం.. నువ్వు నీకు నచ్చినట్టుగా ఉండకూడదు అనుకుంటుంది! దానికోసం నిన్ను పిచ్చోడిని చేస్తుంది, పోరంబోకు ను చేస్తుంది చివరకు దేశ ద్రోహి నీ కూడా ఏమైనా చేస్తుంది! కానీ.. నిజానికి మనం ఎలా ఉండాలి అని మనకు సంబంధించినది అని.. అది మన వ్యక్తిగతం, మన హక్కు అని! అంతేకాని దీనిలో ఈ సమాజానికి ఎలాంటి హక్కు లేదని! కానీ ఈ సమాజం నిన్ను డామినేట్ చేస్తుంది అని.. అక్కడితో ఆగకుండా నిన్ను బెదిరించి నీ వ్యక్తిగతాన్ని లాగేసుకుంటుంది అంటాడు albert camus! మన ఎమోషన్స్ అన్ని మన వ్యక్తిగతం అని అవ్వి మనకు మాత్రమే సొంతం అని అంటాడు albert camus!

ఈ point మీదే Stranger అనే book రాసాడు..ఇది రాసిన కొన్ని నెలలకే ఒక్క sensation అయినది!

ఇది జరిగిన కొన్ని రోజులకు..తను, తన friend, ఆలా బీచ్ లో నడుస్తూ ఉంటే..ఒక్కడు అరబ్ దేశస్తుడు విలిద్దరిపైన గన్ తో attack చేస్తాడు.. ఐతే హీరో self deffence కోసం ఆ అరబ్ దేశస్తుడుని అనుకోకుండా చంపేస్తాడు! ఇంకా అంతే.. అతనిని జైల్లో వేసి ఉరి తీస్తారు!

ఐతే ఈ కథలో హీరో ఆ హత్యని నేరంగా పరిగణించడు! అది కావాల్సి చేసింది కాదని, అదొక్క accident అని, నా ఆత్మరక్షణ కోసం మాత్రమే చంపాను అని, ముందు వాడే మ పైన దాడి చేసాడు అని ఎంత చెప్పిన ఎవ్వడు వినడు!

ఆత్మ రక్షణ కోసం ఒక్క ప్రాణి ఇంకో ప్రాణినిని, ఒక్క జంతువు ఇంకో జంతువుని,ఒక్క మనిషి ఇంకో మనిషిని చంపడం తప్పు కాదని బలంగా నమ్ముతాడు..

ఐతే ఆ అరబ్ దేశస్తుడుని చంపినా తరువాతా.. లాయర్ లు విచారణలో భాగంగా.. అతని స్వభావన్ని గతం నుండి తవ్వడం మొదలేడుతారు! తల్లి చనిపోయిన తరువాత తన girl friend తో sex చెయ్యడం వాళ్లు ఓర్వలేకపోతారు!

తల్లి చనిపోతే ఒక్కసారి కూడ ఎడవడలేదు పైగా తల్లిని ఎప్పుడు పూడ్చి పెడతారు అని ఎదురు చూసాడు! అవన్నీ కాకుండా ఎంచక్కా సిగరెట్ తాగడం పాపం అని నీ మెంటల్ కండిషన్ ఏంటో మాకు తెలుస్తుంది అని వెటకారంగా అంటారు! ఐతే హీరో మాత్రం.. మ అమ్మ చనిపోతే ఏడవకుండా ఉండటానికి, ఆత్మరక్షణ కోసం ఒక్కడిని చంపడానికి ఈ case కి ఏంటి సంబంధం అంటాడు!

Alber camus

ఇక్కడ albert camus ఏమి చెప్పాలి అనుకున్నాడు అంటే..సమాజం మన ఫీలింగ్స్ నీ control చేస్తుంది! నువ్వు ఎప్పుడు ఏడవాలి, ఎలా ఏడవాలి, ఏడవకపోతే నువ్వు కఠినమైన వాడివి, మనస్సు లేని వాడివి! ఒకవేళ అందరు ఏడ్చినట్టు ఏడ్చవ? నువ్వు మంచోడివి, దయగల వాడివి! తల్లి దండ్రుల మీద నీకు చాలా ప్రేముందని ఈ సమాజం decide చేస్తుంది!

నువ్వు ఎంత ఎక్కువ, గట్టిగ ఏడిస్తే నీకు వాళ్ల పైన అంత ప్రేమ ఉందని ఈ సమాజం అనుకుంటుంది! ఒక్కరు చనిపోయూనప్పుడు, మనం ఏడవకపోతే, మనలని bad గా అనుకుంటారని ఏడుస్తాం!

కానీ ఈ కథలో హీరో ఆలా కాదు! నిజానికి ఈ కథలో ఉన్న హీరో కి తల్లికి మధ్య అంత అనుబంధం ఉండదు! ఏదో అతని తల్లి, అతనో కొడుకు అన్నట్టు మాత్రమే ఉంటుంది! పైగా వాళ్ల mother ఇతని కి దూరంగా అనాధ ఆశ్రమం లో ఉంటుంది!

Soo.. హీరో తనకి లేని ఎమోషన్ నీ చూపించాలి అనుకోడు! నన్ను ఎవడో చెడుగా అనుకుంటారు లేదా తప్పు పడతారు అని కూడా ఆలోచించడు! కానీ ఇది ఈ సమాజానికి నచ్చదు, ఈ సమాజం ఒప్పుకోదు! నీకు ఇష్టం ఉన్న లేకున్నా సమాజం పెట్టిన రూల్స్ నీ, ఆచారాలను పాటించాల్సిందే..

ఇక్కడ బాగా ఆలోచిస్తే అర్ధం అవుతుంది ఏంటంటే.. ఈ సమాజం మనలని, మన వ్యక్తిగత ఆలోచనలని control చెయ్యాలని చూస్తుంటది! నువ్వు ఈ రూల్స్ ని break చేసి నీకు నచ్చినట్టు నువ్వు బతకాలి అనుకుంటే, అనుకున్నప్పుడు ఈ సమాజం నిన్ను క్షమించదు! అది నిన్ను వెలివెస్తుంది!అంతటితో ఆగకుండా.. నిన్ను ఎర్రివాడిని అంటుంది, పనికిమాలిన వాడివి అని ముద్ర వేస్తుంది,అవసరం ఐతే దేశ ద్రోహి ని కూడా చేస్తుంది!

alber camus albert camus albert camus video

ఈ కథలో హీరో…సమాజాన్ని ప్రశ్నిస్తాడు ! ఏ మాత్రం నటించడం చేతకాని మనిషి ఈ హీరో, పైగా చిన్నప్పటి నుండి తల్లికి, కొడుక్కి సరైన రిలేషన్ ఉండదు! తను వయస్సు మీద పడి చనిపోతుంది!

Albert Camus మాత్రం.. నేను చంపింది ఆత్మరక్షణ కోసం అని దానికి నేను guilty గా ఫీల్ అవ్వను అని, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటాడు! కానీ చివరకు కోర్ట్.. అతని భావాలను, ఫీలింగ్స్ ని పట్టించుకోదు, లెక్కలోకి తీసుకోదు!

కోర్ట్ ఈ సమాజం లోని రూల్స్ కి వత్తాసు పలుకుతూ అతనికి ఉరిశిక్ష వేస్తుంది! ఇలా చనిపోయాక కూడా ఒక్క చర్చ్ ఫాదర్ వచ్చి.. ఇకనైనా ని తప్పులను ఒప్పుకోమ్మని, ఒప్పుకుంటే మంచివాడివి అవుతావని దేవుడు దగ్గరకు వెళ్తావ్ అని అంటాడు..అయిన గాని మన హీరో.. ఇవన్నీ time waste పనులని.. వీటిమీద నాకు నమ్మకం లేదని, దేవుడిని నమ్మడం, నమ్మకపోవడం నా వ్యక్తి గతం అని.. అందులో నీకు ఎలాంటి హక్కు లేదని, అన్ని మూసుకుని కుర్చో అని ఆ చర్చ్ ఫాదర్ తో అంటాడు!

చివరగా హీరో ఒక్క మాట చెప్తాడు..

ఇక్కడ ఎవ్వరు ఎర్రివాళ్ళు? నేనా? లేక వాళ్ల? వాళ్లేమో నన్ను ఎర్రివాడు అనుకుంటున్నారు, నేనేమో వాళ్ళను ఎర్రివాళ్ళు అనుకుంటున్నాను!ఏది ఏమైనా.. ఈ ప్రపంచంలో..నా character ని judge చేసే అధికారం ఎవ్వడికి లేదు!

నా ఎమోషన్స్, నా కోరికలు పూర్తిగా నా వ్యక్తిగతం! నేను ఎన్నటికీ ఈ సమాజానికి తల వంచను, అది చచ్చిన జరగని పని!ఒక్క ఎర్రివాడు సచ్చాడు అని ఆనంద పడుతారో లేదా ఒక్కడు తనకి నచ్చినట్టు నిజంలో బతిక చచ్చాడు అని కుళ్ళు కుంటారో మీ ఊహకే వదిలేస్తున్న!

ఇంతటితో కథ ముగిస్తుంది.. ఎవరైనా ఈ బుక్ ని చదవాలి అనుకుంటే

ఈ book లింక్ని మన website లోనే philosophy books అనే folder లో పెట్టాను! ఐతే తెలుగు లో కాకుండా ఇంగ్లీష్ లో ఉంది.. చదవాలి అనుకున్నవాళ్ళు అక్కడికెళ్లి చూడండి!

folllw me On Instagram https://www.instagram.com/aviveki_?igsh=N29qZDhzaDgyNnIw

albert camus video albert camus video

For any information contact https://www.aviveki.com/contact/

Love quotes
Previous Post

Albert camus books
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *