
స్వేచ్ఛ -కట్టుబాట్లు
స్వేచ్ఛ కట్టుబాట్లు!
- రామాయన్నీ రాసింది వాల్మీకి ..500 BC to 100 బీసీ
- మహాభారతన్ని రాసింది వ్యాసుడు..3rd centuryto 4th century..
- బైబిల్ ని రాసింది 40 మంది ప్రవక్తలు,అందరూ మగాళ్ళే..1200 to 165AD,
- ఖురాన్ రాసింది మహమ్మద్ ప్రవక్త! AD 610 to 632..
నువ్వు ఏ గ్రంధాన్ని తీసుకున్న, ఆడదానికి స్వేచ్ఛ ఉండదు..ఆడది ఇలా ఉండాలి, అలా ఉండాలి,ఇంకేదో విధంగా ఉండాలి..పరువు కోసం ప్రాణం ఇచ్చే యంత్రం గానే ఈ మత గ్రంధాలు ఆడదాన్ని గురించి రాశాయి..మత గ్రంధాలన్నింటినీ రాసింది మగాళ్ళే,మగ రైటర్స్ హే..ఆడది ఎందుకు రాయలేదు ఇవన్నీ? మగాళ్ళే ఎందుకు రాశారు?? ఆడదాని శరీరం నుండి ఊడి పడిన మగాడికి? ఇంత స్వేచ్ఛ, చదువు ఎవ్వడు ఇచ్చాడు? ఇన్ని గ్రంధాలను రాసేప్పుడు వాళ్లకి వాళ్ళ తల్లులు, పెళ్ళాలు గుర్తుకు రాలేదా? అప్పటి కాలంలో ఉన్న గొప్ప గొప్ప కవులు సంస్కృతి పేరు తో ఆడదానికి, తన పుట్టుక నుండి సచ్చేవరకు కట్టుబాట్లు పెట్టి, ఏ బట్టలు వేసుకోవాలో వారే చెప్పి, ఎలా సంసారం చెయ్యాలో వాళ్ళే చెప్పి, ఎలా చావాలో కూడా వాళ్లే చెప్పారు..ఆడది పుట్టుక నుండే ఆడదాన్ని తొక్కడం మగాడు నేర్చుకున్నాడు, తన తండ్రి తన తల్లి స్వేచ్చని ఎలా ఐతే తొక్కు కుంటూ వచ్చాడో వాడు కూడా ఆడదాని స్వేచ్చని తొక్కు కుంటూ వచ్చాడు. ఇంకా వస్తున్నాడు కూడా..

ఆడది దేవత అంటారు..ఆడది దేవత ఐతే వ్యభిచారులు ఎలా పుట్టుకొచ్చారు??పురాణ రాజులకు వంద మంది, వేయి మంది చెలి కత్తెలు ఎలా పుట్టుకొచ్చారు??అదే ఆడది దేవత అయినప్పుడు..ఒక్కో దేవుడికి ఒక్క పెళ్ళాం సరిపోదా? ఇద్దరు, ముగ్గురు కావాలా?? పోనీ దేవుడు ముగ్గురిని చేసుకున్నాడు..కానీ పెళ్లి చేసుకున్న ఆ దేవతలు అయిన మర్చిపోయారేమో మేము ఆడ దేవతలమని..ఆడది దేవత అయినప్పుడు ఇన్ని కట్టుబాట్లు దేనికి?? ఆ పనికిమాలిన మత గ్రంధాల్లో అంత క్లియర్ గా ఆడది ఇలానే ఉండాలని రాయడానికి కారణం ఏంటి??
ఎందుకంటే .. అప్పటి ఆడవాళ్ళు, ఇప్పటి ఆడవాళ్లు ప్రేమకి లొంగిపోయారు,మగాడు తనని ప్రేమిస్తే చాలు.. తన స్వేచ్చని తీసుకుపోయి మగాడి చేతిలో పెట్టేస్తుంది..ఆ ప్రేమే ఆడదాన్ని సెక్స్ బానిసగా మార్చింది..ఈ దేవుళ్ళ కాలంలో ఉన్నప్పుడే ఆడది తన స్వేచ్ఛ కోసం , మగాడి లాగే నాకు స్వేచ్చలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి అని ఎదురు తిరిగితే..మగాడి లాగే ఆడదానికి స్వేచ్ఛ ఉండేది.. కానీ ఏ దేవత తిరగబడలేదు.. మతిలేని మూఢనమ్మకాలను పాటించమని చెప్పినప్పుడు..దేవతలు నోరు మూసుకుని ఉన్నారు తప్పితే.. ఎందుకు ఏంటి అని అడగలేదు..ఆ దేవతలే ఇప్పుడు ఈ స్త్రీ ప్రపంచానికి inspiration.. వాళ్ళలాగే ఈ కాలం స్త్రీ లు కూడా గమ్మున అన్ని ముసుకొనీ ఉండాలి.. అప్పుడే సమాజం వాళ్లకు బహుమతులు, అవార్డులు మంచి పేరు ఇస్తుంది లేకపోతే చెడ్డ పేరు కట్టపెడుతుంది! మగాడికి ఆడది ఎప్పటికి దేవత కాదు, ఒక్క సెక్స్ బానిసే .. ఒకవేళ దేవత ఐతే ఆ దేవత ఇష్టాలను, స్వేచ్చని దేనికి మగాడు గౌరవించడు?? ఆడదాని స్వేచ్చని గౌరవించని ప్రతి మగాడికి ఆడది ఒక్క బానిసే..ఎన్ని కథలు తీసుకున్న, ఎన్ని చరిత్ర లు తిరిగేసినా ఎన్ని కాలాలు వెనక్కి వెళ్లినా..తన హక్కుల కోసం పోరాడిన ఆడది ఒక్కతీ ఉండదు..మగాడికి ఉన్నట్టే మాకు హక్కులు ఉన్నాయి అని పోరాడిన ఏ ఆడది లేదు..నక్షలైట్ల గుంపులో ఉన్న ఆడది కూడా తమ కులం , మతం, బతుకుల గురించి పోరాడింది తప్పితే..ఆడదాని హక్కుల కోసం పోరాడాలేదు..తమ స్వేచ్ఛ కోసం పోరాడాలనే ఆలోచన దేవతలకే రాలేదు.. ఇంకా ఈ ఆడవాళ్ళకి ఏమి వస్తుంది లే..ఆడవాళ్ళూ మగాడి ప్రేమకి బానిసలూ, ఇప్పటికి ఎప్పటికి..ఆడది తోడు లేకుండా అయిన ఉంటుందేమో, ప్రేమ లేకుండా ఉండదు…ఎందుకంటే అడదాని సృష్టి అలాంటిది..సృష్టి ఆంటే పుట్టుక కాదు, మన మనుషులు నేర్పే సమాజ పాఠాల సృష్టి, దానికి తోడు అప్పట్లో కవులు అల్లిన కథలు పతివ్రత, పాత కథ అనే బిరుదులు ఒక్కటి..మగాడి పోరాటం కంటే,ఆడదాని పోరాటం చాలా విలువైనది, పవర్ గలది..ఆడది గనుక తల్చుకుంటే మతాలు, మత గ్రంధాలు ఇంకో 100 సంవత్సరాలకైనా ఎగిరిపోతాయి,భ్రష్టు పట్టుకుపోయిన మతాలను, కులాలను వేర్ల నుండి పీకేయ్య గల శక్తి ఒక్క ఆడదానికే ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను!

Logic లేని మత గ్రంధాలు, మతిలేని మతాలు, స్వేచ్ఛలేని సమాజానికి నేను వ్యతిరేకిని..ఆడది బురఖా వేసుకోవాలి, చీర కట్టుకోవాలి, నిండుగా బట్టలు వేసుకోవాలి అనే మాటలు పిచ్చనా కొడుకులు మాట్లాడుకునే మాటలు.. దీనికి ఇంకో ఆడది కూడా సపోర్ట్… అది సరిగ్గా బట్టలు వేసుకోలేదు అని..ఏ నీకేం నొప్పి?? నువ్వు వేసుకోవచ్చు గా?? హే నీకూ వేసుకోవడం చేతకాదా??
99%. ఆడవాళ్లు మగాడికి బయపడి..మగాడి ఇష్టానికి అణుగుణంగా ఉంటున్నారు, మాట్లాడుతున్నారు అంతే..ఆడది నాకు దేవతే.. ఎందుకంటే నాకు ఎలా ఐతే స్వేచ్ఛ ఉందో అలాగే నేను ఆడదాన్ని స్వేచ్చని కూడా గౌరవిస్తాను, ఇష్టపడతాను..అప్పుడెప్పుడో వాళ్ళ కాలానికి తగ్గట్టు రాసుకున్న కట్టుబాట్లను ఇన్ని సంవత్సరాలయిన పాటిస్తున్నారు చూడు అది ఇంకా highlight..మతిలేని సంస్కృతి కట్టుబాట్లను గంగలో కలపండి.ఒక్క స్త్రీ ని మనం కంట్రోల్ పెట్టి ఏమి సాధించలేము గౌరవ మర్యాదలు తప్పితే…ప్రాణం కంటే,, మనిషికి గౌరవం మర్యాదలు ఎప్పటికి, ఎవ్వడికి ముఖ్యం కాదు..గౌరవ మర్యాదలు పోతే వస్తాయి, ప్రాణం పోతే రాదుగా??
గౌరవ మర్యాదలకు విలువ ఇచ్చే మతి లేని మనుషులు ప్రాణానికి ఎందుకు విలువ ఇవ్వరు??.తరాతరాల నుండి మోస్తున్న సంస్కృతి అనే మూర్కత్వాన్ని మోస్తున్నారు కాబట్టి!
స్వేచ్చ..ఒకరు ఇచ్చేదా? నువ్వు తీసుకునేదా? ఒకరు ఇచ్చేది అనుమతి అవుతుంది.. కానీ స్వేచ్చ కాదు..నీ ఇష్టాలు, నీ ఆశలు, నీ అభిప్రాయాలు, నీ వెలా ఉండాలో, నీ జీవితం ఎలా ఉండాలో అన్నీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ కలిగి ఉండాలి..పక్షి ఎవరి అనుమతి తీసుకుని ఎగురుతుంది? ప్రకృతి ఎవరి అంగీకారం తో నడుస్తుంది?కానీ మనిషి మాత్రం స్వేచ్చ కోసం తపిస్తున్నాడు..ఎందుకంటే బలవంతుడైన వాడు బలహీనుల పై పెత్తనం చేసి వారి స్వేచ్చ హరించి బానిసలుగా చేసి జీవిస్తునన్నారు..ఇక్కడ బలవంతుడు మగాడు.. కానీ స్త్రీ పురుషుని కన్నా..మనోబలం కలది.. కాబట్టే పురుషుడు ఆమెని కట్టుబాట్లు, సంప్రదాయాలని వంటింటి కే పరిమితం చేసాడు..స్త్రీ కి power కంటే తనకి ప్రేమ, తన కుటుంబం ముఖ్యం అని భావిస్తుంది..ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇంటిని నడిపిస్తుంది.. అలాగే ఎంత బుద్దిశాలి అయినా, తన భర్త ముందు, తన భర్త ప్రేమ ముందు బుర్ర లేనిదే.. కారణం ఆడది ఎమోషనల్ గా ఆలోచిస్తుంది.. తాను నా కుటుంబం అనుకోకుండా, నా సంతోషం, నా సుఖం, నా స్వార్థం అని ఆలోచిస్తే ఏ ఇల్లు ప్రశాంతం గా ఉండదు..అందుకే మగాడు ఆలోచన అంతా స్త్రీ ని కట్టడి చేయాలి లేదంటే తన బతుకు బానిస బతుకే అని గ్రహించి.. ప్రేమ, పిల్లలు, కుటుంబం అనే బాధ్యత లో ఆమె ని తన గురించి కూడా ఆలోచించే సమయం లేకుండా తనని నిస్వార్థ జీవి గా, బాధ్యత లకి బందీ గా మార్చేసాడు..కట్టుబాట్లు.. అనేవి సంస్కృతి ని పెంపొందిం చేవి గా ఉండాలి కాని కట్టుబాట్లు పేరుతో స్త్రీ స్వే చ్చ ని కట్టడి చేసేవి గా ఉండకూడదు..కట్టుబాట్లు అంటూ మూఢనమ్మకాలను, మూర్కత్వా లను గొర్రెలు కసాయి వాడిని నమ్మినట్లు పెద్దవారిని తరువాత తరం వారు ఆచరించటం అజ్ఞానం!

కేవలం పురుష అహంకారం తో అయితే స్త్రీ కి పతియే ప్రత్యక్ష దైవం అని, పతిని తప్ప పరాయి మగవాడిని భార్య చూస్తే మహా పాపం అని.. పతివ్రతలు అంటూ పురాణ స్త్రీ లను ఉదాహరిస్తూ.. ఒక వర్గం..స్త్రీ కేవలం సౌందర్యం, శృంగారం, ఆమె శరీరాన్ని, ఆమె కనులు, కురులు, ఇలా వర్ణించటం కొందరు కవుల వంతు..ఆడదాన్ని అందలం ఎక్కించే వర్ణణలు, పొగడ్తలు..అన్నీ మగవాడి అవసరానికే..కానీ.. రాజ్యాలు ఏలిన రాణులతో, వారి ధైర్యం తో, వారి సాహసం తో ఏ కవి, ఏ గ్రంధాలు ఎందుకు పోల్చరు.. ఎందుకు పోల్చలేదు?మనోబలం కల్గిన స్త్రీ మగవాడి ప్రేమ కి లొంగిపోతుంది..కుటుంబం అనే సుడిగుండం లో చిక్కుకుపోయి, తన శక్తి ని, తన యుక్తి ని ఎరుగక తన స్వేచ్చ ఎవరో ఇవ్వాలి అని ఎదురు చూస్తుంటుంది..కుటుంబం లో స్త్రీ, పురుషులు ఇద్దరు ప్రధాన పాత్రలే..ఇక్కడ ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ, గౌరవం ఇస్తేనే ఇల్లు ప్రశాంతం గా ఉంటుంది.. కుటుంబం బాగుంటుంది..ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు పెద్దలు.. నీ ఇంట్లో ఇల్లాలు ని నీవే అగౌరవపరిస్తే, నీవే నిర్లక్ష్యం చేస్తే.. ఆమె లో లేని సంతోషం నీ ఇంటికేం పంచుతుంది..ఆంజనేయుడికి కూడా తన శక్తి గుర్తొచ్చేస్తే కానీ తన బలం తెలుసుకోలేడు..స్త్రీ కూడా తను బలహీనురాలిని, ఆడదాన్ని అని భావిస్తుంది.. ఈ సృష్టి కి మూలం.. తన పై అజమాయిషి చేసే మగాడి ని కన్నది తానే అని మరిచి.. మగవాడి బలానికి బానిస అవుతుంది..ఆడది ఆదరించే అమ్మ ఏ కాదు..ఆగ్రహిస్తే ఆపరకాళి గా రాక్షస సంహారం చేయగలదు అని మరిచింది..ముందు స్త్రీ బలహీనురాలు.. ఒకరిమీద ఆధారపడాలి.. అనే ఆలోచన మానుకోవాలి..జన్మే తనది..జీవితం మాత్రం.. తనవారికే అంకితం..పుట్టుక మొదలు మరణం వరకు అడుగడుగునా పోరాటమే..ఆడబిడ్డ గా, కూతురై..మరోయింటికి కోడలై..పునర్జన్మ ఎత్తుతూ.. బిడ్డ కి జన్మని ఇస్తూ.. అమ్మ గా..అనురాగం, ఆప్యాయత అందరికి పంచుతూ..తనని మరిచి..తనవారినే తలుస్తూ.. తన వారి క్షేమం కై, పరిగిడుతూ..అలసిపోని, అలుపెరుగని, ధీరురాలే మగువ..అనురాగం పంచిన, అణుకువ తో మెలిగిన, అన్యాయం సహించిన..ఆడది.. అంటే అలుసే.. అనురాగం అమృతం లా పంచేది స్త్రీ.. సహనం కోల్పోతే శక్తి గా మారే.. ఆది శక్తి స్త్రీప్రత్యేకంగా ఆమెని గౌరవించి.. కిరీటాలు పెట్టి సత్కరించక్కర్లేదు..ఆమెని ఆమె లా గౌరవిస్తే చాలు..ఆకాశం అంత ప్రేమ చూపక్కర్లేదు..అణువంత ప్రేమ చూపిస్తే.. నీకు ఆకాశం అంత ప్రేమ ని కురిపించే.. అద్భుతమే ఆమె..నీకు పుట్టుక ఇచ్చి..ఆమె పుట్టుక కే స్వేచ్ఛని కోల్పోయి.. నీతో సహవాసిఅయి జీవించేదే.. స్త్రీ..ఏ బంధం లో అయినా..ఎప్పుడు ఒక్కరే తలవంచుతూ,ఒక్కరే అర్ధం చేసుకుంటూ,ఒక్కరే సర్దుకుపోతూ ఉంటే,అది బంధం అనిపించుకోదు..బానిసత్వం అవుతుంది..బంధం కావాలి అంటే రెండు వైపులా అర్ధం చేసుకుని, ఒకరికి అభిప్రాయాలను గౌరవించుకుంటే ఆ బంధం బలపడుతుంది..ఆ బంధానికి అర్ధం ఉంటుంది..బంధం అనేది భరోసా ఇవ్వాలి..భారం కాకూడదు..బంధాలని గౌరవిస్తేనే ఆ మనిషి..పిలిచే బంధానికి విలువ!! ఒక మనిషి కి కట్టుబడి ఉండటం కంటే… నీ మనసు కి నీవు కట్టుబడి ఉంటే, నిన్ను నీవు గెలుస్తావ్.. నలుగురి హృదయాల్లో నిలుస్తావ్!!
Cut చేస్తే.. ఇప్పుడు స్వేచ్ఛ అనేది మారుతూ ఉంది.. మగవాడిలాగే ఆడవారికి కూడా స్వేచ్ఛ దొరుకుతుంది! ఐతే కొందరు దాన్ని తప్పుగా వాడుకుంటున్నారు, ఇంకొందరు సరైన పద్దతిలో వాడుకుంటున్నారు..
స్వేచ్చని వాళ్లు ఎలా వాడుకున్న వాళ్ళది వాళ్లకు ఇవ్వాల్సిందే.. అది తప్పుగా వాడుకున్న, సరిగా వాడుకున్న! ఎందుకంటే అది gender equality 😁
Follow me on instgaram https://www.instagram.com/aviveki_?igsh=N29qZDhzaDgyNnIw

FOR ANY ENQUIRIES CONTACT https://www.aviveki.com/contact/