September 11, 2025
స్వార్థం మంచిదేనా
Articles

స్వార్థం మంచిదేనా

Jun 7, 2025

కానీ వాటికి ఉన్న తెలివి తేటలు.. మనిషి నుండి తమను తాము కాపాడుకోవడానికి కుడా సరిపోవు! ఎందుకంటే మనిషితో పోల్చితే జంతువులకి తెలివి తేటలు చాలా తక్కువ! Soo మనిషి అనేవాడు.. తనకి అవతలి వారిని మచ్చిక చేసుకునే తెలివి ఉంది కాబట్టే గొప్పగా ఉంటున్నాడు!

ఇక్కడ ఈ తెలివి కి తోడు.. డబ్బు, పేరు,పరపతి తోడైతే?? వాడే కదా హీరో? ఇలా డబ్బు అతి కొద్ధిమంది దగ్గర ఉండటం, వాళ్లకు తెలివి ఉండటం వలన.. తెలివి, డబ్బు లేని, ఎక్కువ సంఖ్య లో ఉన్న జనాలను.. ఈ డబ్బు, తెలివి తక్కువ సంఖ్య లో ఉన్నవారు డబ్బు, తెలివి తక్కువ ఉన్నవారిని మచ్చిక చేసుకున్నారు! ఇంతకు ముందు మనిషి అనేవాడు జంతువులను మచ్చిక చేసుకున్నట్టుగా! ఇలా ఎన్నో సంవత్సరాలనుండి ధనవంతుడు, పేదవాళ్ళని మచ్చిక చేసుకుంటూ వస్తున్నాడు!

ఇలా మచ్చిక చేసుకునే ప్రయత్నం లో, కాలం గడుస్తున్న కొద్దీ.. జనాలకి తెలివి వచ్చి, వాడి కష్టం తో ధనవంతుడు ఐతే, తరాతరాల నుండి, యుగాలా నుండి వస్తున్న ధనవంతులు ఏమి అవ్వాలి? వాళ్లకి కష్టం చేసే వారు లేకపోతే వాళ్లు ఏమిటి అవుతారు? వాళ్ళను ఎవరు లెక్క చేస్తారు, ఎవరు జేజే లు కొడుతారు??Soo.. ఇలా జరగకూడదు అనే తెలివి గల ధనవంతుడు..స్వార్థం మంచిది కాదు, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది.. అని మంచి మాటలు చెప్పి వాటిని గ్రంధాలలో ముద్రించారు!

ఈ మంచి మాటలు ప్రతివాడు పాటించాలి అని లేకపోతే వాడు చెడ్డ వాడు అవుతాడు అని నియమాలు, నీతులు పెట్టాడు! అదే తరాతరాల నుండి సాగుతూ వస్తుంది! ఎన్నో యుద్దాలు జరిగాయి, ఎంతో మంది రాజులూ పోయారు, రాజ్యాలు పోయాయి.. అయిన ఆ సూత్రాలు పోలేదు అవి విలువల లాగా అలానే continue అవుతూ వస్తున్నాయి! ఇది చరిత్ర..

ఇక ప్రస్తుతానికి వస్తే..అస్సలు స్వార్థం మంచిదేనా? ఒకవేళ మంచిది ఐతే ఎలాంటి స్వార్థం మంచిది? ఒకవేళ చెడ్డది ఐతే, ఎందుకు చెడ్డది ఈ స్వార్థం? ఐతే..ఇప్పటి కి ప్రపంచంలో ని ధనవంతులు అంత..స్వార్థం తో పైకి వచ్చిన వారే!అస్సలు స్వార్ధమే లేకుంటే.. మనిషి అనేవాడు అడవి మనిషి గా మిగిలిపోయేవాడు! స్వార్థం ఉంది కాబట్టే మనిషి అనేవాడు అభివృద్ధి చెందతూవచ్చాడు! ఐతే మనలో ఉండే స్వార్థం.. కోడికి ఈకలు పీకే దగ్గరే ఆగిపోయినది!

స్వార్థం

ఎందుకంటే.. స్వార్థం అంటే..ఒక్కడిని చూసి ఓర్వక పోవడం, బాగుపడుతుంటే ఒక్కడిని కిందకు లాగడం, ఒక్కడు ఫ్యాషన్ ఉంటే, బట్టలు వేసుకుంటే, వాడిని చూసి పిచ్చి నా కొడుకు అని ముద్ర వేయడం దగ్గరే మన స్వార్థం ఆగిపోయింది!ఇది మనలో ఉండే స్వార్థం, మనతో ఉండే స్వార్థం! కానీ నిజమైన స్వార్థం ఇది కాదు! స్వార్థం అనేది ఏదయినా కనిపెట్టడం లో, ఏదైనా సృష్టించడం లో ఉండాలి! ఏదయినా మానవ జాతిని మార్చే విధంగా ఉండాలి..అదే నిజమైన స్వార్థం! స్వార్థం అంటే పక్కోడు ఎదుగుతుంటే చూసి వాడిని కిందకు లాగడం ఉండేది కాదు!

వాడు ఎదుగుతుంటే నేను కూడా ఎదగాలి, వాడి దగ్గర నేను తక్కువ అవ్వకూడదు, వాడు నాకంటే గొప్పోడు ఏమి కాదు, నేను కూడా ఎదుగుతాను అనే స్వార్థం ఉండాలి! అలాంటి స్వార్థం గనుక నీలో ఉంటే నువ్వే అసలైన స్వార్ధ పరుడివి! అలా కాకుండా.. పక్కనోడిని అణగద్రోక్కాలనే స్వార్థం ఏదైతే ఉందో అది అన్నిటికన్నా నీచమైనది! కానీ దురదృష్టవశాత్తు నేను బాగుపడాలి ఎలాగైనా అనే స్వార్థం కంటే.. పక్కనోడు బాగుపడకూడదు అనే స్వార్ధమే ఎక్కువ ఈ ప్రపంచంలో!

బలహీనమైనవారు మాత్రం ఇలా నీచంగా స్వార్థం తో ఉంటారు! ఐతే.. ఈ ప్రపంచంలో బలహీనమైన వారే ఎక్కువ కాబట్టి! ఎక్కువ మొత్తం ఈ నీచమైన స్వార్ధమే ఉన్నది… ఉంటుంది! కానీ నేను అనే స్వార్థం ఏదైతే ఉందో..ఆ స్వార్థం.. ధనవంతుల దగ్గర, philosophers దగ్గర మాత్రమే ఉంటుంది!మిగతా జనాల లో ఉండే స్వార్థం,కేవలం వాళ్లలో ఉండే ఎర్రితనానికి పరాకాష్ట!

Titel Name :

స్వార్థం స్వార్థం స్వార్థం స్వార్థం

Follow me on instagram https://www.instagram.com/aviveki_?igsh=N29qZDhzaDgyNnIw

స్వార్థం

Title name : స్వార్థం స్వార్థం స్వార్థం స్వార్థం స్వార్థం

For any information Contact https://www.aviveki.com/contact/

Albert camus books
Previous Post

6 Comments

  • Super👌👌
    Chala baga chepparu

  • 👏👏👏

  • Great 👏👏

  • Nijame 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *