
గొర్రెలు అంటే ఎవరు?
గొర్రెలు!
ఈ మధ్య బాగా పాపులర్ అయిన topic.. Instagram లో youtube లో మనం regular గా చూస్తుంటాం, వింటుంటాం..
ఒక్క మతం వారు అవతలి మతం వారిని గొర్రెలు అని, అవతలి మతం వారు ఇవతలి మతం వారిని మీరే గొర్రెలు అని తిట్టుకుంటూ ఉంటారు!
అస్సలు నిజానికి గొర్రెలు అంటే ఎవరు??
గొర్రె అనే ఎందుకు అంటారు?
ఇక్కడ గొర్రెలు, గొర్రె అంటే అర్ధం.. గుడ్డిగా ఒకదాన్ని నమ్మేవారు, follow అయ్యేవారు!
అది మనిషిని కావచ్చు, మతాన్ని కావచ్చు!
దేవుడిని నమ్మేవారు కావచ్చు, దెయ్యాన్ని నమ్మేవారు కూడా కావచ్చు!
ఐతే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో.. ఒక్క A మతానికి చెందిన వారు.. మా మతం, మా దేవుడే గొప్పోడని.. మిగతా B మతం, వారి దేవుడు గొర్రెలని వాదిస్తూ, చర్చలు జరుపుతూ ఉంటారు!
అలాగే ఈ B మతం వారు కూడా మా మతమే గొప్పదని, మా దేవుడే గొప్పవాడని ఆ మతం వారిపై వాదిస్తూ, చర్చలు జరుపుతూ ఉంటారు..
నిజానికి ఇక్కడ ఇద్దరు గొర్రెలే!
ఎందుకంటే.. మనం ముందే చెప్పుకున్నట్టు.. దేన్నైనా గుడ్డిగా follow అయ్యేవాళ్లను నమ్మేవాళ్ళను గొర్రెలు అంటాం!
ఇక్కడ ఇద్దరు కూడా దేవుడు కోసం లేదా మతం కోసం వాదిస్తున్నారు కాబట్టి, ఇద్దరు కూడా గొర్రె జాతికి చెందినవారే!
నీ దేవుడిని నువ్వు చూడలేవు, వాడి దేవుడిని వాడు చూడలేదు.. అయినా ఇద్దరు ఒకరి మీద ఒక్కరు పంచ్ లు వేసుకుంటున్నారు నువ్వు గొర్రె అంటే, నువ్వే గొర్రె అని!
నిజానికి..దేవుడిని, మతాన్ని నమ్మే ప్రతివాడు ఒక్క గొర్రెనే.. అది ఏ మతం ఐతే ఏంటి, ఏ దేవుడు ఐతే ఏంటి?? వాటి విలువలు, సూత్రాలు ఏ మాత్రం చదువుకొని వారిచే సృష్టింపబడ్డాయి!

దేవుడిని నమ్మితే, దెయ్యాన్ని కూడా నమ్మాల్సి ఉంటుంది!
ఈ రెండింటిని నమ్మితే మతాన్ని కూడా నమ్మాల్సి ఉంటుంది!
అది హిందూ మతం కావచ్చు.. క్రిస్టియన్ మతం కావచ్చు.. ముస్లిం మతం కావచ్చు!
ఇంకా ఏదైనా కావచ్చు!
ఇక్కడ మతాన్ని నమ్మినా, దేవుడిని నమ్మినా .. వాటికి ఉన్న వున్న విలువలని పాటించాల్సి ఉంటుంది!
ఐతే ఈ మతాల చరిత్ర తీసుకుంటే..మతాలు అనేవి కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టినవి!
విలువలు కూడా అప్పుడే పుట్టినవి!
అప్పటి తరం నుండి ఈ తరానికి ఈ విలువలు అనేవి అలాగే ఉన్నాయి!
వాటినే మనం ఇంకా పాటిస్తున్నాం!
ఐతే కొన్ని వేల సంవత్సరాలనుండి ఎంతో మంది చనిపోయారు.. వాళ్ళందరిని మనం పాతి పెట్టేశాము.. అలా కాకుండా ఇంట్లో పెట్టి పూజించలేము!
ఒకవేళ అలా పూజిస్తే.. ఆ శవం నుండి వచ్చే వాసన కి నువ్వే చనిపోతావు!
కాబట్టి శవాన్ని పాతి పెట్టక తప్పదు!
ఇక్కడ విలువలు కూడా అలాంటివే! అప్పటి విలువలకు కాలం చెల్లింది!
ఇంకా నువ్వు వాటినే పాటిస్తున్నావ్ అంటే నువ్వు గొర్రెవే కదా మరి? గొర్రెవి కాకుండా పోవు కదా?
దేవుడిని నమ్మడం, లేదా మతాన్ని నమ్మడం అంటే మూఢనమ్మకాలను నమ్మడమే!

ఐతే ఈ మూఢనమ్మకాలు, దేవుడికి, మతానికి, దెయ్యానికి లింక్ చేయబడి ఉంటాయి ఎప్పుడు!
పుట్టుక తో గుడ్డితనం లేని వారు కూడా వీటిని నమ్మే విషయం లో పూర్తిగా గుడ్డివారైపోతారు..
ఇలా గుడ్డివాడైపోయిన ప్రతీ వాడు ఒక్క గొర్రెనే!
మరి దేవుడిని నమ్మకపోతే గొర్రెలు కాకుండా ఉంటారా అంటే?
అస్సలు మనిషి బ్రతకడానికి దేవుడు అనేవాడు అవసరమే లేదు!
దేవుడు ఉంటే నీకేంటి, లేకపోతే నీకేంటి?
దేవుడు వచ్చి నీ పీక పైన కత్తి పెట్టి.. నేను ఉన్నాను అని ఒప్పుకో లేకపోతే చంపేస్తా అని బెదిరించడం లేదు గా? అలాంటప్పుడు నువ్వెందుకు దేవుడు అనే మాటకోసం కొట్టుకుని చస్తున్నావ్??
దేవుడు కోసం వేరే వారిని దూషిస్తున్నావ్? మతం కోసం ఎందుకని వేరే వారిని చంపుతున్నావ్?
ఎందుకంటే.. తరతరాలనుండి ఈ మతం, దేవుడిని నమ్మడం మనకి ఉన్న అవకాశం లా కాకుండా..దానొక్క విలువల, ఆ విలువ మన ఇగో కి సంబంధించినది లా ఈ సమాజం లో సృష్టించారు!
నువ్వు ఆ విలువలను పాటించకపోయినా, నమ్మకపోయిన నిన్ను పిచ్చోడు అంటారు, లేకపోతే చెడు జరుగుతుంది అని భయపెడుతారు! చివరకి నువ్వు అదే నిజం అని నమ్మక తప్పదు! ఒకవేళ నీవు నమ్మకపోతే ఈ సమాజం బలవంతంగా అయిన ఆ చెడును సృష్టిస్తుంది!
నీ తల్లిదండ్రులు, ఈ సమాజం కలిసి.. దేవుడు, దెయ్యం, మతం అనే వాటిని.. నీ చిన్నతనం నుండే నీ బుర్రలో నూరిపోశారు!
వాళ్లు ఏళ్ళ తరపడి గొర్రెల్లా ఉంటూ,
ని పుట్టుకతోనే నిన్ను గొర్రెలా తయారు చేస్తున్నారు!
దేవుడు, మతం, దెయ్యం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి.. నా బ్రతుకు నేను బ్రతికి అనున్నప్పుడే నువ్వు గొర్రె నుండి సింహం గా మారతావు!
ఇంకొందరు మూర్ఖులు కూడా ఉంటారు.. దేవుడు అనేవాడు అస్సలు లేడు అని వాదించే వారు!
దేవుడు ఉన్నాడని, లేడని వాదన ఏదైతే ఉందో అది వట్టి మూర్ఖత్వపు వాదన!
ఎందుకంటే… దేవుడు ఉన్నాడు.. కానీ అతను నిన్ను పట్టించుకోడు, నీ బాధలని వినిపించుకోడు, నువ్వెలా సచ్చినా, నువ్వు మంచోడివి అయినా, చెడ్డోడోవి అయినా.. నువ్వు అనేది దేవుడికి అనవసరం!
కాబట్టి.. మతాలు, కులాలు అనే భావన అప్పటి తెలివి గల వాడు, అతని కింద ఉన్న జనాలను ఎర్రోళ్లను చేసి, తను గొప్పగా బతకాలి, తను మాత్రమే అన్ని హక్కులను పొందాడం కోసం సృష్టించినవే!
నీకు కొంచెం కూడా self respect అనేది ఉంటే.. నిన్ను పట్టించుకోవడం మానేసినోళ్లను ఈ క్షణమే పట్టించుకోవడం మానెయ్..
అందులో దేవుడు అనేవాడు మొదటి వ్యక్తి!
నా మతం ప్రకృతి, నా కులం మనిషి కులం!
దేవుడు సహాయం చేస్తాడు,
నీ బాధలని వింటాడు, నీ సమస్య లని తీరుస్తాడు అనేది ఒట్టి మూఢనమ్మకం!
నువ్వు ఇన్ని ఏళ్లుగా follow అవుతుంది ఆ మూఢనమ్మకాన్ని!
మీరు follow అవుతున్న విలువలు అన్నీ ఆనాడు ఉన్న జనాలను ఎర్రివాళ్ళను చెయ్యడానికి మాత్రమే రాసుకున్నవి.. కానీ దురదృష్టం ఏంటంటే.. అవ్వే ఇప్పుడు జనాలకు అతి గొప్ప విలువలు అయిపోయాయి!
దేవుడు మీ అవసరాలను, తీర్చనప్పుడు మీరు దేవుడిని ప్రశ్నించండి, మీ బాధలను తీర్చనప్పుడు దేవుడిని పట్టుకుని అడగండి!
అంత దమ్ముందా నీకు? ఒక్కడు తప్పు చేసాడని తిట్టి, జైల్లో పెట్టె ఈ సమాజం..
దేవుడునీ ఎన్ని సార్లు అడిగిన కనిపించడం లేదని ఏ ఒక్కరు అయిన అతని పైన negitve గా మాట్లాడారా? మాట్లాడరు.. ఎందుకంటే ఒకవేళ మాట్లాడితే మనకు ఏమి అవుద్దో అని ఈ మనుషుల భయం!

నాకు తెలీక అడుగుతా.. ఒక్క మతం గురించి పొట్లాడాల్సింది ఆ మతం యొక్క దేవుడు కదా? కానీ మనుషులు పొట్లాడటం ఏంటి?
నువ్వు ఒక్క మతాన్ని తిట్టినంత మాత్రాన ఆ మతం యొక్క దేవుడు వచ్చి నిన్ను శిక్షించడు,
అవతలి వాడు నీ మతాన్ని తిట్టినా నీ దేవుడు వాడిని వెళ్లి శిక్షించడు!
కానీ శిక్షిస్తాడు అనుకుంటాం నమ్ముతాం..
ఇలా నమ్మేవాళ్ళే గొర్రెలు!
Soo.. ఈ ప్రపంచంలో ఉన్న 90% జనాలు గొర్రెలే!
నేను దేవుడు అనేవాడు బతికి ఎప్పుడో చనిపోయాడు! అనుకుంటా..
అతన్ని కూడా సమాధిలో పాతి పెట్టారు! మీరు ఇంకా దేవుడు అని నమ్ముతుంది ఆ సమాధిలో పాతి పెట్టబడిన వారినే!
విలువలు అని నమ్ముతుంది ఆ సమాధిలో పాతి పెట్టిన వారు, పెట్టిన ఆంక్షలే!
Soo.. మొత్తానికి ఈ మతం, దేవుడి కోసం పొట్లాడే, వాదించే ప్రతి వాడు ఒక్క గొర్రెనే!
నా దృష్టిలో.. దేవుడి కోసం, మతం కోసం కొట్లాడే అర్హత ఆ దేవుడికి మాత్రమే ఉంది.. కొట్లాడితే, తిడితే అ దేవుడే కొట్లాడాలి కానీ అ దేవుడి కోసం మనిషి కొట్లాడటం ఏంటి??
ఎర్రిపుకుతనం కాకపోతే!
మతం, దేవుడి, కులం కోసం కొట్లాడే బాధ్యత మనది కాదు!
అది ఆ దేవుడిది.. ఎందుకంటే సృష్టికర్త అతనే కదా, వాటిని సృష్టించింది అతనే కదా?
ఆ దేవుడికే అతను సృష్టించిన వాటి గురించి పట్టించుకోవడం లేదు.. మరి నీకెందుకు రా? దాని గురించి!
లేదు bro.. అవన్నీ సృష్టించింది అతను కాదు మనుషులే అవన్నీ సృష్టించారు అంటే??
మనుషులు సృష్టించిన వాటి గురించి నువ్వు కొట్లాడుతున్నావ్, పొట్లాడుతున్నావ్, వాదిస్తున్నావ్ అంటే..
ఇక్కడ ఎవరు గొర్రెలు అనే ఊహ నీకే వదిలేస్తున్న!
Follow me on Instagram https://www.instagram.com/aviveki_?igsh=N29qZDhzaDgyNnIw

For any information contact https://www.aviveki.com/contact/